చింతకొమ్మదిన్నె మండలం లో వైసీపీ నేత . అక్రమ.ఇసుక.తవ్వకాలు
కడప 19 డిసెంబర్ (హి.స.)ప్రభుత్వం ఏదైనా వైసీపీ నేతల మట్టిదందా)మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది. గత
చింతకొమ్మదిన్నె మండలం లో వైసీపీ నేత . అక్రమ.ఇసుక.తవ్వకాలు


కడప 19 డిసెంబర్ (హి.స.)ప్రభుత్వం ఏదైనా వైసీపీ నేతల మట్టిదందా)మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది. గత ఏడాది కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతల దందాకు అడ్డుకట్ట పడుతుందని భావించారు. కానీ వారి దందా ఏమాత్రం ఆగడం లేదు. చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఏపీఐఐసీ భూములు కొందరు వైసీపీ నేతలకు వfరంగా మారాయి. ఇక్కడి భూముల్లోని మట్టిని కొల్లగొడుతున్నారు. దీంతో పరిశ్రమలకు భూముల్లో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande