మెదక్ జిల్లాలో దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య..
మెదక్, 2 డిసెంబర్ (హి.స.) భార్యను చంపి, భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) దంపతులకు ఓ కుమ
మర్డర్


మెదక్, 2 డిసెంబర్ (హి.స.)

భార్యను చంపి, భర్త ఆత్మహత్యకు

పాల్పడిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయానికి మంజుల హత్యకు గురికాగా, శ్రీశైలం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. టేక్మాల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, పరిశీలిస్తున్నారు. వీరి మరణాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande