
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లా
భలూకాలో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ (27) పై జరిగిన మూకదాడి, హత్య ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. దైవదూషణ ఆరోపణలతో అల్లరి మూకలు అతడిని కొట్టి చంపి, మృతదేహాన్ని చెట్టుకు కట్టి తగలబెట్టిన ఈ క్రూరమైన చర్యను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేపట్టిన రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB-14) వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఏడుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. నిందితులను ఎండీ లిమన్ సర్కార్, ఎండీ తారెక్ హొస్సేన్, ఎండీ మానిక్ మియా, ఎర్షాద్ అలీ, నిజుమ్ ఉద్దీన్, అలోంగిర్ హొస్సేన్, ఎండీ మిరాజ్ హొస్సేన్ అకాన్గా గుర్తించారు.
ఈ ఘటనపై మహమ్మద్ యూనస్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. కొత్త బంగ్లాదేశ్లో ఇటువంటి హింసకు తావు లేదు అని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..