
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ (PTI)
వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), ఆయన భార్య బుష్ఠా బీబీలకు ఊహించని షాక్ తగిలింది. తోషాఖానా-2 కేసులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ప్రత్యేక కోర్టు శనివారం వారికి 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021 మే నెలలో సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన అత్యంత ఖరీదైన 'బుల్గారీ జ్యువెలరీ సెట్'ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకు సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఈ కేసులో రుజువయ్యాయి. రావల్పిండిలోని అడియాలా జైలులో జరిగిన విచారణ అనంతరం స్పెషల్ జడ్జ్ షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే జైలులో ఉండగా, ఈ తాజా శిక్ష ఆయన రాజకీయ భవిష్యత్తుపై మరింత ప్రభావం చూపనుంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..