హైదరాబాద్లో 'ప్రమాదకర' స్థాయికి చేరిన వాయు నాణ్యత
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ తరహాలో వాయు కాలుష్యం తాజాగా హైదరాబాద్కు చేరింది. వాయు నాణ్యత సూచీ (AQI) 255కు చేరుకుని ''ప్రమాదకర'' స్థాయికి చేరింది. ముఖ్యంగా బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల, మల్లాపూర్ వంటి పారిశ్రామిక, రద్దీ ప్ర
పొల్యూషన్


హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ తరహాలో వాయు కాలుష్యం తాజాగా హైదరాబాద్కు చేరింది. వాయు నాణ్యత సూచీ (AQI) 255కు చేరుకుని 'ప్రమాదకర' స్థాయికి చేరింది. ముఖ్యంగా బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల, మల్లాపూర్ వంటి పారిశ్రామిక, రద్దీ ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రంగా ఉంది. శీతాకాలపు పొగమంచుకు తోడు వాహనాల ఉద్గారాలు, చెత్త దహనం వల్ల గాలిలో సూక్ష్మ ధూళి కణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సైనసైటిస్, డస్ట్ అలర్జీ, శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా ఉదయం వేళల్లో వ్యాయామాలకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande