
సంగారెడ్డి, 21 డిసెంబర్ (హి.స.) తెలంగాణను చలి గజగజ వణికిస్తోంది. నేడు ఉదయం సంగారెడ్డి జిల్లా కోహిర్ లో అత్యల్పంగా 4.5 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలితోపాటు తీవ్రమైన పొంగమంచు కురుస్తుండటంతో వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 - 5 డిగ్రీలు తక్కువ నమోదు అవుతాయని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు