బహిరంగ మార్కెట్ లో.యూరియా ధర.తగ్గడం లేదు
అమరావతి, , 22 డిసెంబర్ (హి.స.) బహిరంగ మార్కెట్లో యూరియా ధర తగ్గడం లేదు. సరిపడా నిల్వలున్నాయని వ్యవసాయశాఖ చెబుతున్నా.. కొన్నిచోట్ల కొరత వెన్నాడుతోంది. గరిష్ఠ అమ్మకపు ధర రూ.267 ఉంటే.. ప్రకాశం జిల్లాలో కొన్నిచోట్ల ప్రైవేటు దుకాణాల్లో బస్తా రూ.400 చొ
బహిరంగ మార్కెట్ లో.యూరియా ధర.తగ్గడం లేదు


అమరావతి, , 22 డిసెంబర్ (హి.స.) బహిరంగ మార్కెట్లో యూరియా ధర తగ్గడం లేదు. సరిపడా నిల్వలున్నాయని వ్యవసాయశాఖ చెబుతున్నా.. కొన్నిచోట్ల కొరత వెన్నాడుతోంది. గరిష్ఠ అమ్మకపు ధర రూ.267 ఉంటే.. ప్రకాశం జిల్లాలో కొన్నిచోట్ల ప్రైవేటు దుకాణాల్లో బస్తా రూ.400 చొప్పున విక్రయిస్తున్నారు. చాలా జిల్లాల్లో సగటున బస్తాకు రూ.350 చొప్పున వసూలు చేస్తున్నారు. రైతు సేవాకేంద్రాలు (ఆర్‌ఎస్‌కే), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్‌)లకు వెళ్తే యూరియా ఎప్పుడు వస్తుందో తెలియదంటున్నారని రైతులు పేర్కొంటున్నారు.

చిత్తూరు జిల్లాలోనూ యూరియా ఇబ్బందులున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అవసరం కంటే ఎక్కువగా నిల్వలున్నాయని అధికారులు నివేదికలిస్తున్నా.. క్షేత్రస్థాయిలో కొరత నెలకొంది. దగదర్తి మండలంలోని గ్రామాల్లో కొన్నిచోట్ల రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కావలి, కందుకూరు ప్రాంతంలోని దుకాణాల్లో బస్తాకు రూ.100 అధికంగా తీసుకుంటున్నారు. పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు వరితోపాటు మొక్కజొన్నకూ యూరియా వేయాల్సి ఉండటంతో డిమాండు పెరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande