
అమరావతి, 22 డిసెంబర్ (హి.స.): పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ములను ప్రత్యర్థులు నరికి చంపారు. దుర్గి మండలం అడిగొప్పలలో ఈ ఘటన జరిగింది. అన్న హనుమంతు, తమ్ముడు శ్రీరాంమూర్తిని ఆదివారం అర్ధరాత్రి వేటకొడవళ్లతో హతమార్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘోరానికి పాల్పడినట్లు సమాచారం. మృతులిద్దరూ తెదేపా సానుభూతిపరులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ