
ఢిల్లీ22డిసెంబర్ (హి.స.)
ఎయిరిండియా విమానానికి అత్యవసర పరిస్థితి ఎదురైంది (Air India flight). సాంకేతికలోపం కారణంగా ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ జీరోకి పడిపోయింది. దిల్లీ నుంచి ముంబయికి బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ఈ లోపాన్ని గుర్తించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం..
దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 3.20 గంటల సమయంలో ఎయిరిండియా బోయింగ్ విమానం (Flight AI887) టేకాఫ్ అయింది. ఆ వెంటనే కుడివైపు ఇంజిన్ (Engine No 2) ఆయిల్ ప్రెజర్ అసాధారణంగా తగ్గిపోవడాన్ని పైలట్ గుర్తించారు. తర్వాత అది జీరోకు పడిపోయింది. దాంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు (Air India). టేకాఫ్ అయినచోటే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా స్పందించింది. భద్రతా ప్రోటోకాల్స్ ఆధారంగా విమాన సిబ్బంది నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆ విమానంలో సాంకేతికపరమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ