418 కిలోమీటర్ల ఎత్తులో ‘స్టార్‌లింక్‌’లో తలెత్తిన లోపం
ఢిల్లీ22డిసెంబర్ (హి.స.)ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులో భాగంగా మోహరించిన ఓ ఉపగ్రహం అదుపుతప్పింది. ఈ శాటిలైట్‌ పేరు స్టార్‌ లింక్‌-35956. భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఇందులో సాంకేతిక సమస్య తలెత్త
Elon Musk


ఢిల్లీ22డిసెంబర్ (హి.స.)ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులో భాగంగా మోహరించిన ఓ ఉపగ్రహం అదుపుతప్పింది. ఈ శాటిలైట్‌ పేరు స్టార్‌ లింక్‌-35956. భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఇందులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇది త్వరగా పడిపోతూ భూమివైపునకు దూసుకొస్తోంది. మరి ఈ ఉప్రగహంతో ప్రమాదం పొంచి ఉందా..?

స్టార్‌లింక్‌ ప్రాజెక్టును 2015లో స్సేస్‌ఎక్స్‌ ప్రారంభించింది. ఇంటర్నెట్‌ సేవల కోసం నిర్మించిన వేలాది ఉపగ్రహాల సమూహమిది. ప్రపంచవ్యాప్తంగా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందించడం, ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు సేవలను అందించడం దీని ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా భారీ సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతోంది. తొలి దశలో 12 వేల వరకు పంపాలన్నది సంస్థ ప్రణాళిక. ప్రస్తుతం 9,357 గ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. ఇందులో 9,357 పనిచేస్తున్నాయి.

5

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande