
ఢిల్లీ22డిసెంబర్ (హి.స.)జెనీవాలోని భారత శాశ్వత మిషన్‌లో రూ.2 కోట్ల నిధుల అక్రమ దారిమళ్లింపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి.. అక్కడ గతంలో అకౌంట్స్ అధికారిగా పనిచేసిన మోహిత్‌పై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మోహిత్ ఆ నిధులను క్రిప్టో-గ్యాంబ్లింగ్ వ్యాపారాల కోసం వినియోగించాడని అధికారులు తెలిపారు. జెనీవాలోని భారత శాశ్వత మిషన్‌లో మోహిత్ 2024 డిసెంబరులో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా చేరారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్)కు చెల్లింపు సూచనలను భౌతికంగా సమర్పించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఒకే బ్యాంకు చెల్లింపు సూచనల పత్రం కింద అనేక క్యూఆర్ కోడ్‌లను జతచేయడం సాధారణ పద్ధతి. దాన్ని ఆధారంగా చేసుకుని మోహిత్ కొందరు విక్రేతల క్యూఆర్ కోడ్‌ల స్థానంలో సొంత క్యూఆర్ కోడ్‌లను చేర్చాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ