
ఢిల్లీ22డిసెంబర్ (హి.స.)భారతదేశం-న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వే్చ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా జరిగింది. ప్రధాని మోడీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. అనంతరం చారిత్రాత్మక, ప్రతిష్టాత్మకమైన పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా జరిగిందని సంయుక్తంగా ప్రకటించారు.
9 నెలల చర్చల తర్వాత ఒప్పందం తుది రూపం దాల్చిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా చర్చలు జరిగాయి. ఇన్నాళ్లకు తుది రూపం దాల్చింది. సోమవారం చర్చలు ఫలించినట్లుగా నేతలిద్దరూ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడం కోసం ఇది ఎంతగానో దోహదపడుతుందని ఇరువురి నాయకులు చెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ