పీకేతో ప్రియాంక భేటీ..
ఢిల్లీ22డిసెంబర్ (హి.స.)కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రాతో రాజకీయ వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) భేటీ కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 15న దిల్లీ వేదికగా దాదాపు రెండు గంటల పాటు జరిగిన వీరి ప
Prashant Kishore


ఢిల్లీ22డిసెంబర్ (హి.స.)కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రాతో రాజకీయ వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) భేటీ కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 15న దిల్లీ వేదికగా దాదాపు రెండు గంటల పాటు జరిగిన వీరి ప్రైవేటు సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బిహార్‌లో కాంగ్రెస్‌ పార్టీ కోసం ఒక ప్రధాన ప్రాజెక్టును ప్రశాంత్‌ కిశోర్‌ చేపడతారనే ప్రచారం ప్రస్తుతం మొదలైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో హస్తం పార్టీకి పీకే చేదోడుగా నిలిచే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande