బంగ్లాలో హింస సర్వ సాధారణంగా మారింది.. షేక్ హసీనా
ఢిల్లీ22డిసెంబర్ (హి.స.) తాజా పరిణామాలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. బంగ్లాదేశ్‌లో హింస సర్వసాధారణంగా మారిపోయిందని వాపోయారు. గతేడాది దేశంలో జరిగిన మారణహోమాన్ని ఆపడానికే దేశం వీడిచి భారత్‌కు వచ్చానన్నారు. అంతే తప్ప భయపడి రాలేదన్
Sheikh Hasina


ఢిల్లీ22డిసెంబర్ (హి.స.) తాజా పరిణామాలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. బంగ్లాదేశ్‌లో హింస సర్వసాధారణంగా మారిపోయిందని వాపోయారు. గతేడాది దేశంలో జరిగిన మారణహోమాన్ని ఆపడానికే దేశం వీడిచి భారత్‌కు వచ్చానన్నారు. అంతే తప్ప భయపడి రాలేదన్నారు. అయినప్పటికీ దేశంలో మాత్రం ఉద్రిక్తతలు తగ్గలేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనస్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బంగ్లాదేశ్‌లో హింస పెరిగిపోయిందని.. ప్రభుత్వం బలహీనంగా మారిపోయిందని ధ్వజమెత్తార. చట్టాలు సరిగ్గా అమల్లో లేవని.. దేశంలో పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్‌ పేరు కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలు భారత్‌-బంగ్లాదేశ్ బంధాన్ని దెబ్బతీస్తున్నాయని వాపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande