మార్కెట్‌కు కొత్త జోష్.. భారీ లాభాల్లో సూచీలు
ముంబై, 22డిసెంబర్ (హి.స.) ఏడాది చివరిలో స్టాక్ మార్కెట్‌కు కొత్త ఊపు వచ్చింది. గత కొద్దిరోజులుగా మార్కెట్ భారీ నష్టాలు ఎదుర్కొంటోంది. ఇండిగో సంక్షోభం సమయంలో అయితే మార్కెట్‌కు భారీ కుదుపు చోటుచేసుకుంది. ఈ వారం ప్రారంభంలో మాత్రం నూతనోత్సహం కనిపిస్తో
Bombay Stock Exchange


ముంబై, 22డిసెంబర్ (హి.స.)

ఏడాది చివరిలో స్టాక్ మార్కెట్‌కు కొత్త ఊపు వచ్చింది. గత కొద్దిరోజులుగా మార్కెట్ భారీ నష్టాలు ఎదుర్కొంటోంది. ఇండిగో సంక్షోభం సమయంలో అయితే మార్కెట్‌కు భారీ కుదుపు చోటుచేసుకుంది. ఈ వారం ప్రారంభంలో మాత్రం నూతనోత్సహం కనిపిస్తోంది. సోమవారం అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 483 పాయింట్లు లాభపడి 85,413 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 166 పాయింట్లు లాభపడి 26,133 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండడంతో మార్కెట్ జోష్‌లో కనిపిస్తోంది.

శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, TCS, జియో ఫైనాన్షియల్ నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించగా… ఆసియన్ పెయింట్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, మాక్స్ హెల్త్‌కేర్, సిప్లా నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఐటీ ఒక్కొక్కటి 1 శాతం పెరగగా.. BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి. మొత్తానికి రూపాయి విలువ కోలుకుంది. గత కొద్దిరోజులుగా రూపాయి దారుణంగా పతనమైంది. ఆర్బీఐ జోక్యంతో ప్రస్తుతం రూపాయి విలువ పెరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande