నేడు వైకుంఠ ద్వారదర్శనాలపై టీటీడీ సమీక్ష
తిరుమల, 22 డిసెంబర్ (హి.స.)వైకుంఠ ద్వార దర్శనాలపై నేడు టీటీడీ ఆధ్వర్యంలో సమీక్ష జరగనుంది. మంత్రులు ఆనం రాం నారాయణ రెడ్డి, అనిత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో ఈ రోజు మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకూ
తిరుమల


తిరుమల, 22 డిసెంబర్ (హి.స.)వైకుంఠ ద్వార దర్శనాలపై నేడు టీటీడీ ఆధ్వర్యంలో సమీక్ష జరగనుంది. మంత్రులు ఆనం రాం నారాయణ రెడ్డి, అనిత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో ఈ రోజు మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది.

ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్న నేపథ్యంలో.. భక్తులకు ఏర్పాట్లు, తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే టీటీడీ ఆదేశించింది.

తొలి మూడు రోజుల్లో మూడు ప్రాంతాలకు చెందిన భక్తులను అనుమతించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో తోపులాటలు, గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనాలు కల్పించేందుకు టీటీడీ సిద్ధమవుతంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 30వ తేదీ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సంబంఽధించి 1.76 లక్షల మందికి ఈ-డిప్‌ విధానంలో ముందస్తుగానే స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్లను కేటాయించింది. జనవరి 2వ తేదీ నుంచి 8 వరకూ ఎలాంటి టోకెన్లు, టికెట్లు లేకపోయినా వైకుంఠం క్యూ కాంప్లెక్స్

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande