
చంద్రపుర్ 23 డిసెంబర్ (హి.స.): ప్రతి వ్యక్తికి అందుబాటు ధరలో విద్య, వైద్యం అవసరమని, ఈ సేవల వికేంద్రీకరణ జరగాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌స్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. సోమవారం ఆయన మహారాష్ట్రలోని చంద్రపుర్‌లో పండిట్ దీన్‌దయాళ్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులపైనే కాకుండా వారి కుటుంబంపై కూడా క్యాన్సర్ తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ‘‘క్యాన్సర్‌కు కారణాలు నిర్దిష్టంగా ఉండవు. దేవుడి ఇచ్చిన ఈ దేహాన్ని మానవాళి సేవకు మనం వినియోగించాలి. క్యాన్సర్ బాధితులకు సేవ చేయడంలో భాగస్వామ్యం కావాలి’’ అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ