మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. డీజీపీ ఎదుట 22 మంది సరెండర్
మల్కాన్‍గిరి, 23 డిసెంబర్ (హి.స.)మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా (Odisha) మల్కాన్‍గిరి జిల్లాలో (Malkangiri District) మంగళవారం 22 మంది మావోయిస్టులు (Maoist Surrender) లొంగిపోయారు. ఒడిశా డీజీపీ వైబీ ఖురానీ, ఇతర సీనియర్ అధికార
22-maoists-who-surrendered-in-odisha-506779


మల్కాన్‍గిరి, 23 డిసెంబర్ (హి.స.)మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా (Odisha) మల్కాన్‍గిరి జిల్లాలో (Malkangiri District) మంగళవారం 22 మంది మావోయిస్టులు (Maoist Surrender) లొంగిపోయారు. ఒడిశా డీజీపీ వైబీ ఖురానీ, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. సరెండర్ సందర్భంగా మావోయిస్టులు తమ వద్ద ఉన్న 9 తుపాకులు, 150 రౌండ్ల మందుగుండు సామాగ్రి, 20 కిలోల పేలుడు పదార్థాలు, 13 ఐఈడీలు, జెలటిన్ స్టిక్స్, ఇతర వస్తువులు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులలో 19 మంది ఒడిసాకు చెందిన వారు, ఇద్దరు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవారు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande