
ఢిల్లీ23డిసెంబర్ (హి.స.) భారత్‌లో అధికార పార్టీకి ఈడీ, సీబీఐ ఆయుధాలు అని.. వారిపై ఒక్క కేసు కూడా లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. భారత్‌లో బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) లను ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.
భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని.. పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందని వ్యాఖ్యానించారు. నిఘా సంస్థలు, ఈడీ, సీబీఐలను ఆయుధాలుగా మారయని.. ఈ సంస్థల దగ్గర బీజేపీ నాయకులపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. రాజకీయ కేసుల్లో ఎక్కువ భాగంగా వారిని వ్యతిరేకించే వారిపైనే ఉన్నాయని చెప్పుకొచ్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ