
కోల్‌కతా:/ఢిల్లీ23డిసెంబర్ (హి.స.) ‘భాజపా మార్గదర్శకత్వంలోనే ఎన్నికల సంఘం(ఈసీ) పనిచేస్తోంది. రాష్ట్రంలో నిర్వహించిన ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో చాలా తప్పులున్నాయి. చట్టపరంగా ఓటు హక్కు కలిగిన అనేక మంది ఓట్లను తొలగించారు. కనీసం రెండేళ్లు పట్టే ఓటరు గణన ప్రక్రియ కేవలం రెండు నెలల్లోనే పూర్తిచేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో టీఎంసీ బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్‌ఏ) సమావేశంలో ప్రసంగించిన ఆమె.. ఎస్‌ఐఆర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ విచారణల కోసం నియమించిన కేంద్ర అధికారులపై కూడా మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ