బిహార్‌లోని నీతీశ్‌ పాలనపై శశిథరూర్‌ ప్రశంసలు..
ఢిల్లీ23డిసెంబర్ (హి.స.) కేంద్రంలోని భాజపాపై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బిహార్‌లోని ఎన్డీయే కూటమి పాలనను అభినందించారు (Tharoor Praises NDA Government in Bihar). ర
బిహార్‌లోని నీతీశ్‌ పాలనపై శశిథరూర్‌ ప్రశంసలు..


ఢిల్లీ23డిసెంబర్ (హి.స.) కేంద్రంలోని భాజపాపై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బిహార్‌లోని ఎన్డీయే కూటమి పాలనను అభినందించారు (Tharoor Praises NDA Government in Bihar). రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టిందన్నారు.

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు థరూర్‌ బిహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు తాను విన్న దానికంటే బిహార్‌లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. రోడ్లు బాగున్నాయన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రజలు వీధుల్లోకి వస్తున్నారని.. శాంతి, భద్రతలు మెరుగుపడ్డాయన్నారు. విద్యుత్, నీటి సదుపాయాలు కూడా సరిగ్గా ఉన్నాయని థరూర్‌ (Shashi Tharoor) అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande