
ముంబై/ఢిల్లీ23డిసెంబర్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 638.12 పాయింట్ల వృద్ధితో 85,567.48 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 206 పాయింట్లు బలపడి 26,172.40 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించ వచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ట్రేడర్లు ఐటీ, వాహన, లోహ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరపడం ఇందుకు దోహదపడింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మరో రూ.4.11 లక్షల కోట్లు పెరిగి రూ.475.32 లక్షల కోట్లకు (5.31 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ