
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 30 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్లతో అక్రమంగా సెమీ ట్రక్కులు నడుపుతున్నారని, మరికొందరు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్నారని తెలిపారు. ఇంటర్ ఏజెన్సీ కార్యకలాపాల్లో భాగంగా ఇమిగ్రేషన్ చెకోపోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించగా, మొత్తం 49 మంది అక్రమ వలసదారులుగా గుర్తించినట్టు యూఎస్ CBP మరో ప్రకటనలో స్పష్టం చేసింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..