మహిళలకు బిగ్ షాక్.. ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయో చూడండి
ముంబై, 25 డిసెంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులోకి వెళ్లిపోతున్నాయి. 2025వ సంవత్సరం ముగుస్తున్న క్రమంలో గోల్డ్ రేటు ఏమైనా తగ్గుతుందేమోనని ఆశించిన వారికి షాకే తగిలింది. రోజురోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతోండగా.. వెండి కూడా గట్టి
gold


ముంబై, 25 డిసెంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులోకి వెళ్లిపోతున్నాయి. 2025వ సంవత్సరం ముగుస్తున్న క్రమంలో గోల్డ్ రేటు ఏమైనా తగ్గుతుందేమోనని ఆశించిన వారికి షాకే తగిలింది. రోజురోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతోండగా.. వెండి కూడా గట్టి పోటీ ఇస్తోంది. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,39,860 వద్ద ఉంది. నిన్న ఈ ధర రూ.1,39,640 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు రూ.220 మేర ధర తగ్గిందని చెప్పవచ్చు. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు ధర రూ.1,28,200 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,39,250గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,27,650 పలుకుతోంది.

బంగారం ధరలు గురువారం కూడా భారీగా పెరిగాయి. సోమవారం నుంచి గోల్డ్ ధరలు బ్రేకుల్లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం అయినా తగ్గుతాయని ఆశించిన ప్రజలకు మళ్లీ షాకే తగిలింది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు అవాక్కవుతున్నారు

.

ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఇవాళ రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2,44,000 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.వెయ్యి పెరిగింది. ఇక విజయవాడలో కేజీ వెండి ధర రూ.2,45,000గా ఉండగా..విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande