కళ్యాణదుర్గం మండల కేంద్రానికి సమీపంలోని.గ్రానైట్ కొండలో చిరుత సంచారం
కళ్యాణదుర్గం, 26 డిసెంబర్ (హి.స.) మండల కేంద్రానికి సమీపంలోగల గ్రానైట్‌ కొండలో గురువారం చిరుత కనిపించడంతో స్థానిక రైతులు భయాందోళన చెందారు. గత కొన్ని రోజులుగా ఈ కొండలో చిరుత సంచరిస్తున్నట్లు సమీప పొలాల రైతులు పేర్కొన్నారు. అలాగే ఎలుగుబంట్ల సంచారం కూ
కళ్యాణదుర్గం మండల కేంద్రానికి సమీపంలోని.గ్రానైట్ కొండలో చిరుత సంచారం


కళ్యాణదుర్గం, 26 డిసెంబర్ (హి.స.)

మండల కేంద్రానికి సమీపంలోగల గ్రానైట్‌ కొండలో గురువారం చిరుత కనిపించడంతో స్థానిక రైతులు భయాందోళన చెందారు. గత కొన్ని రోజులుగా ఈ కొండలో చిరుత సంచరిస్తున్నట్లు సమీప పొలాల రైతులు పేర్కొన్నారు. అలాగే ఎలుగుబంట్ల సంచారం కూడా అధికంగా ఉంటోంది. దీంతో రాత్రి సమయాల్లో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నట్లు వారు వాపోయారు. అటవీశాఖాధికారులు స్పందించి చిరుతను బంధించాలని రైతులు, ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande