
నర్సీపట్నం, 26 డిసెంబర్ (హి.స.)
అనకాపల్లి జిల్లా నాతవరం పోలీసులు శుక్రవారం గంజాయి ముఠాని అరెస్టు చేశారు. కేసు వివరాలను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. నిందితుల నుంచి 74 కిలోలు గంజాయి, కారు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.33 లక్షలు ఉంటుందని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బీటెక్ చదువుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి మానేసిన విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మాడుగులపేట గ్రామానికి చెందిన గాది రేణుకగా పోలీసులు గుర్తించారు. ఆమెతో పాటు తమిళనాడుకు చెందిన సూర్య కాళిదాసు మదన్ కుమార్, ముత్తు, రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన పడ్డూరి ప్రసాద్, పాడేరు మండలం గుత్తలతపుట్టుకు చెందిన అండెంగుల రవికుమార్, చింతపల్లి మండలం లోతుగడ్డ జంక్షన్‌కు చెందిన లలిత కుమారి, జీకేమండలం పెదవలస గ్రామానికి చెందిన పొన్నగంటి మణికుమారి ఉన్నారు. నాతవరం ఎస్సై తారకేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ