
అమరావతి, 26 డిసెంబర్ (హి.స.)
సైబర్ నేరాలకు పాల్పడే కీలక నిందితుడిని ఏపీ సీఐడీ పోలీసులు (అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వేల సంఖ్యలో సిమ్ కార్డులతో పాటు, పలు కంప్యూటర్‌లు, ఇతర సాంకేతిక పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఐడీ డీజీ ఆసిఫ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇంటర్నేషనల్ మోసగాడిని అరెస్టు చేశామన్నారు. ఈ మోసాలకు పాల్పడేందుకు అనేక రకాల అధునాతన సాంకేతిక పరికరకాలు వాడుతున్నారని తెలిపారు. వారి నుంచి అనేక పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంటర్నేషనల్ కాల్స్‌ను లోకల్ కాల్‌గా మార్చి చూపుతున్నారని.. దీంతో చాలా మంది కాల్స్ మాట్లాడటం ద్వారా మోసపోతున్నారని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ