
అమరావతి, 26 డిసెంబర్ (హి.స.)
అమరావతి, : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణిలో జరిగిన చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) ఒక మధ్యంతర నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఏసీబీ డీజీ ఇవాళ (శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ