కేటీఆర్ బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.. ఎంపీ చామల
తెలంగాణ, 26 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎ
ఎంపీ చామల


తెలంగాణ, 26 డిసెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

కేటీఆర్ విమర్శలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కేసీఆర్ కుటుంబం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను వంచించి అప్పుల పాలు చేసిందని కేవలం తమ సొంత సంపదనే పెంచుకుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయితే, కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande