
జోగులాంబ గద్వాల, 26 డిసెంబర్ (హి.స.)
జోగులాంబ గద్వాల జిల్లాలో శాంతి
భద్రతల పరిరక్షణకు తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ టీ.శ్రీనివాస్ రావు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన 2025 సంవత్సరం వార్షిక నేర నివేదికను విడుదల చేశారు.
గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో నేరాలు 11 శాతం మేర తగ్గాయని ఎస్పీ వివరించారు. 2024లో 2703 ఎఫ్ఎఆర్లు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 2410కి పరిమితమైంది. బీట్ సిస్టమ్ను బలోపేతం చేయడం నిరంతర నిఘా వల్ల ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గంభీరమైన నేరాలు (Grave Crimes) 42 , 2024 5 161 కేసులు ఉంటే ఈ ఏడాది కేవలం 92 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు