
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను
వరుసగా రెండుసార్లు గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు పాదాభివందనం చేసినా తక్కువేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేడు శేరిలింగంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు తప్ప మరేమీ చేయడం లేదని విమర్శించారు. మేడిగడ్డను కూల్చివేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చెక్ డ్యామ్లను కూడా పేల్చివేస్తున్నారని మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు