సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలి: మెదక్ జిల్లా కలెక్టర్
మెదక్, 26 డిసెంబర్ (హి.స.) ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా
మెదక్ కలెక్టర్


మెదక్, 26 డిసెంబర్ (హి.స.)

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ

ప్రసవాలపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇప్పటికే నిర్దేశించిన ప్రసవ లక్ష్యాలను చేరుకునేందుకుగాను అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande