
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)
క్రిస్మస్ పండుగల వేళ బస్సు అదుపు
తప్పి లోయలో పడిన ఘటన మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికో సిటీ నుంచి చికోంటెపెక్ గ్రామానికి వెళ్తున్న బస్సు జోంటెకోమట్లాన్ పట్టణం సమీపంలో అతివేగంతో అదుపు తప్పి పక్కనే ఉన్న భారీ లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 32 మందికి గాయాలయ్యాయి. మరణించిన వారిలో 9 మంది పెద్దలు, ఒక చిన్నారి ఉన్నారని అధికారులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు