
కరీంనగర్, 26 డిసెంబర్ (హి.స.)
క్రీడాభివృద్ధి ' కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన క్రికెట్ స్టేడియంలో కాక స్మారకార్థం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను మరో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శుక్రవారం ప్రారoభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తన నియోజకవర్గం అయిన హుస్నాబాద్లో 20 ఎకరాల స్థలం ఇచ్చేందుకు తాను సిద్దమని అన్నారు. అయితే ఆ స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మించాల్సిన బాధ్యత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, మంత్రి వివేక్ వెంకటస్వామి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం క్రీడల కోసం అందించే వసతులను వినియోగించుకొని ఉత్తమ క్రీడాకారులుగా తయారవ్వాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు