
పెద్దపల్లి, 26 డిసెంబర్ (హి.స.)
రూ.99 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను సమ్మక్క జాతర లోగా పూర్తి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు దశల వారిగా కృషి చేస్తానన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వసతి సౌకర్యాలను కల్పించే విదంగా పని చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు