
సంగారెడ్డి, 26 డిసెంబర్ (హి.స.)
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని
ప్రజలందరికీ నిత్యం తాగేందుకు అవసరమైన నీటిని సరఫరా చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో మిషన్ భగీరథ, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ సమావేశంలో జగ్గారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంగారెడ్డి మున్సిపాలిటీ కి ప్రతీ రోజు 8.5 ఎం.ఎల్.డి నీటిని కేటాయించాలని తెలిపారు. రాజంపేట పంప్ హౌజ్ నుంచి వెలుగు ఆఫీస్ పంప్ హౌజ్ కు ఇంటర్ కనెక్టివిటీ లైన్ ను పునరుద్ధరించాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు