
తెలంగాణ, 26 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో సంక్రాంతి సెలవులు
ఖరారు అయ్యాయి. జనవరి 10న రెండో శనివారం, జనవరి 11న ఆదివారం కావడం మరియు జనవరి 18న ఆదివారం కలిసి రావడంతో 9రోజులు సెలవులు ప్రకటించారు. దీంతో జనవరి 19న అంటే సోమవారం తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
అయితే తెలంగాణలో గతేడాది ఆరు రోజులే సెలవులు ఇవ్వగా ఈ ఏడాది రెండో శనివారం, ఆదివారాలు కలిసి రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు