దేశ రాజధాని.ఢిల్లీలో. వీర్ బాల్.దివస్.ఘనంగా నిర్వహించారు
అమరావతి, 26 డిసెంబర్ (హి.స.) న్యూఢిల్లీ, డిసెంబర్ 26: దేశ రాజధాని ఢిల్లీలో వీర్ బాల్ దివస్‌ ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ ko పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Dr
దేశ రాజధాని.ఢిల్లీలో. వీర్ బాల్.దివస్.ఘనంగా నిర్వహించారు


అమరావతి, 26 డిసెంబర్ (హి.స.)

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: దేశ రాజధాని ఢిల్లీలో వీర్ బాల్ దివస్‌ ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ ko పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Mmurmu ) అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా ఏపీకి చెందిన పారా అథ్లెట్ శివాని (Young Para-athlete Shivani ) రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్నారు. శివాని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మద్దికెర గ్రామం. గత నాలుగేళ్లగా జావెలిన్‌ త్రో, షాట్‌పుట్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ్మ ప్రతిభ కనబరుస్తున్నందుకు శివానిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అలాగే తెలంగాణకు చెందిన పడకంటి విశ్వనాథ్ కార్తికేయకు రాష్ట్రపతి ముర్ము రాష్ట్రీయ బాల పురస్కార్ అందించారు. విశ్వనాథ్ కార్తికేయ తెలంగాణ మేడ్చల్ మల్కాజ్‌గిరి వాసి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande