
ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.)
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో మారుతున్న సైనిక వ్యూహాలు, అభివృద్ధి చెందుతున్న హైపర్ సోనిక్ క్షిపణి వ్యవస్థలను.. భారత్ తేలిగ్గా తీసుకోకూడదని హెచ్చరించారు (). ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాక్‌తో ఉన్న గత అనుభవాల నుంచి భారత్ చాలా నేర్చుకున్నందున ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉండాలన్నారు. డ్రోన్లు, రాకెట్లు, క్షిపణుల తర్వాత హైపర్‌సోనిక్ సాంకేతికతపై పాక్ దృష్టిసారించిందన్నారు. ఇది భారత్ తేలికగా తీసుకునే విషయం కాదన్నారు. పాక్ (Pakistan)లో ప్రజాస్వామ్యం నామమాత్రంగానే ఉందని.. ఇప్పటికీ సైనిక ఆధిపత్యమే కొనసాగుతుందన్నారు. ఆర్థికంగా దుర్భర పరిస్థితిలో ఉన్న ఆ దేశం.. విదేశాల నుంచి అందే సాయంపైనే ఆధారపడుతుందని థరూర్ (Shashi Tharoor) అన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ