
న్యూఢిల్లీ, 27 డిసెంబర్ (హి.స.) కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలోని ఇందిరా భవన్లో సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభమైంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పాటు ఇతర సీనియర్ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచలప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. ఇక ఈ సమావేశానికి శశిథరూర్ హాజరు కావడం ప్రత్యేక ఎట్రాక్షన్గా నిలిచింది.
శశిథరూర్ ఎక్కువగా బీజేపీ నేతలతో కలిసి ఉంటుంటారు. వారితో కలిసి ఉంటూ కాంగ్రెస్ను విమర్శిస్తూ ఉంటారు. దీంతో కాంగ్రెస్తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ మధ్య కాంగ్రెస్ నిర్వహించిన ఏ కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. తాజాగా జరుగుతున్న సీడబ్ల్యూసీ మీటింగ్కు మాత్రం హాజరై స్పెషల్ ఎంట్రాక్షన్గా నిలిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు