
న్యూఢిల్లీ, 27 డిసెంబర్ (హి.స.)
ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు
పెరిగిపోతుంది. ఇదివరకు నమోదైన కాలుష్యంతో పోలిస్తే రెండు మూడు రోజుల నుండి తక్కువ కాలుష్య స్థాయిలు నమోదవ్వగా తాజాగా మళ్లీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నేడు రాజధాని నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400కిపైగా నమోదైంది. దీంతో ఢిల్లీని పొగమంచు కప్పేసింది. పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. పలు రైళ్లు, విమానాల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..