
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.)
ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందని అన్నారు. మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కంటే కార్పొరేటర్లే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యం అని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా దేశంలోని ఒక తరం మొత్తం పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు.
ఎలాంటి అధ్యయనం మూల్యాంకనం లేకుండా రాష్ట్రాలు లేదా పార్టీలతో చర్చించకుండా పథకాన్ని రద్దు చేశారని అన్నారు. మహాత్మాగాంధీ పేరుపై ఉన్న పథకాన్ని రద్దు చేయడం ఆయనను అవమానించడమే అని వ్యాఖ్యానించారు. ఈ పథకాన్ని రద్దు చేసి మెడీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టడమే కాకుండా వెన్నుపోటు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు యుద్ధం చేయాలని యుద్ధంలో మనమే గెలుస్తామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..