వాళ్లు కలుస్తారని ‘సిక్స్త్‌ సెన్స్‌’ చెప్పింది: అత్యాచార కేసులో సుప్రీం వ్యాఖ్యలు
ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.) ఓ అత్యాచార కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తి, బాధితురాలు ముందు ఏకాభిప్రాయంతోనే ఉన్నారని.. ఆ తర్వాత వారి మధ్య వచ్చిన విభేదాల వల్ల అతడ
Supreme Court


ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.)

ఓ అత్యాచార కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తి, బాధితురాలు ముందు ఏకాభిప్రాయంతోనే ఉన్నారని.. ఆ తర్వాత వారి మధ్య వచ్చిన విభేదాల వల్ల అతడిపై కేసు నమోదు చేసినట్లు గమనించామని న్యాయమూర్తులు జస్టిస్‌ వి.నాగరత్న, సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అపార్థాల వల్ల విడిపోయిన వారు మళ్లీ కలుస్తారని తమ ‘సిక్స్త్‌ సెన్స్‌’ చెప్పిందని పేర్కొంది. దోషి, బాధితురాలిని వివాహం చేసుకోవడంతో అతడిపై ఉన్న ఫిర్యాదు, శిక్షను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

పోలీసు ఛార్జిషీట్‌ ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు 2015లో సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అనంతరం వివాహం విషయంలో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తనను వివాహం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ మహిళ 2021లో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande