
లక్నో/ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.) ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)ప్రక్రియ ముగిసింది. ఓటర్ల జాబితాలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ భారీ కసరత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించనున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం ఓటర్లలో దాదాపు 18.7 శాతం మంది పేర్లు గల్లంతు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. డిసెంబర్ 31న ఎన్నికల కమిషన్ అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నది.
ఈ భారీ కసరత్తుకు సంబంధించి అధికారులు గణాంకాలను వెల్లడించారు. తొలగించిన పేర్లలో దాదాపు 1.25 కోట్ల మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు బూత్ లెవల్ అధికారులు గుర్తించారు. అలాగే సుమారు 45.95 లక్షల మంది ఓటర్లు మరణించగా, 23.59 లక్షల మంది పేర్లు రెట్టింపు (డూప్లికేట్) అయినట్లు నిర్ధారించారు. మిగిలిన వారిలో సుమారు 84 లక్షల మంది ఓటర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడం (మిస్సింగ్) గమనార్హం. ముఖ్యంగా రాజధాని లక్నోలోనే ఏకంగా 12 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు సమాచారం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ