దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్! దేశం విడిచి పారిపోతున్న వైద్యులు, ఇంజనీర్లు
ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.) పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ విడుదల చేసిన తాజా డేటా ఈ దారుణ పరిస్థితి గురించి వెల్లడించింది. 2024లో పాకిస్థాన్‌కి చెందిన 7,27,381 మంది విదేశీ ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా, ఈ ఏడాది నవంబర్ వ
దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్! దేశం విడిచి పారిపోతున్న వైద్యులు, ఇంజనీర్లు


ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.)

పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ విడుదల చేసిన తాజా డేటా ఈ దారుణ పరిస్థితి గురించి వెల్లడించింది. 2024లో పాకిస్థాన్‌కి చెందిన 7,27,381 మంది విదేశీ ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా, ఈ ఏడాది నవంబర్ వరకే 6,87,246 మంది నమోదు చేసుకున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. గతంలో గల్ఫ్ దేశాలకు కూలీ పనుల కోసం వెళ్లేవారు. ఇప్పుడు చదువుకున్న, నైపుణ్యం ఉన్న వృత్తి నిపుణులు కూడా పెద్ద సంఖ్యలో దేశం విడిచిపెడుతున్నారు.

నివేదిక ప్రకారం.. డాక్టర్లు దేశాన్ని విడవటం మరింత ఆందోళన కలిగించింది. ఆరోగ్య రంగం అత్యంతగా దెబ్బతింది. 2011 నుంచి 2024 మధ్య కాలంలో నర్సుల వలస 2,144 శాతం పెరిగింది. ఈ ఏడాది కూడా అదే ధోరణి కొనసాగిందని పాకిస్థాన్ ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదిక తెలిపింది. వైట్ కాలర్ ఉద్యోగులు అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో వెళ్లిపోవడంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విమానాశ్రయాల్లో నియంత్రణలను కఠినతరం చేసింది. 2025లోనే 66,154 మంది ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే నిలిపివేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande