
ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.)
వీసా దరఖాస్తుదారులకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది (US Embassy). అమెరికా ఆంక్షల నేపథ్యంలో హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్, రెన్యువల్స్ ఆలస్యమవుతుండటంపై యూఎస్ ఎంబసీ స్పందించింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని కొందరు నకిలీ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఎలాంటి జాప్యాలకు తావు లేకుండా వీసా (H-1B visa) లభించేలా చూస్తామంటూ ఆ నకిలీ ఏజెంట్లు దరఖాస్తుదారుల్ని సంప్రదిస్తున్నారని అప్రమత్తం చేసింది. అలాంటి హామీలను నమ్మొద్దని, దానివల్ల ఆర్థికంగా నష్టం, ప్రయాణ ప్రణాళికల్లో ఇబ్బందులు తలెత్తవచ్చని ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసింది.
వీసా అపాయింట్‌మెంట్లు అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే షెడ్యూల్ అవుతాయని స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ