న్యూఇయర్‌ ముందు భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.) న్యూఇయర్‌కు ముందు దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద 285 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా నేరాల్లో నిందితులుగా పోలీసు
న్యూఇయర్‌ ముందు భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం


ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.)

న్యూఇయర్‌కు ముందు దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద 285 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా నేరాల్లో నిందితులుగా పోలీసులు అనుమానించి అరెస్ట్ చేశారు.

జూదగాళ్ల నుంచి 310 మొబైల్ ఫోన్లు, 231 ద్విచక్ర వాహనాలు, రూ.2,30,990 నగదు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు చక్రాల వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నివారణ చర్యల కింద 1,306 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ హేమంత్ తివారీ తెలిపారు. అలాగే 20 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, 27 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 12,258 క్వార్టర్ల అక్రమ మద్యంతో పాటు 6.01 కిలోల గంజాయి రికవరీ చేసుకున్నారు

ఆపరేషన్‌లో దేశీయంగా తయారు చేసిన 21 పిస్టల్స్, 27 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande