మార్కెట్లో నిస్తేజం
ముంబై:/ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.)ముందుకు నడిపించే ట్రిగ్గర్లేవీ లేకపోవడం, విదేశీ నిధుల తరలింపు ఈక్విటీ మార్కెట్లో నిస్తేజాన్ని నింపాయి. ఈ కారణంగా వరుసగా మూడో రోజు కూడా మార్కెట్‌ నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్‌ 367.25 పాయింట్ల నష్టంతో 85,041.45 వద్
మార్కెట్లో నిస్తేజం


ముంబై:/ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.)ముందుకు నడిపించే ట్రిగ్గర్లేవీ లేకపోవడం, విదేశీ నిధుల తరలింపు ఈక్విటీ మార్కెట్లో నిస్తేజాన్ని నింపాయి. ఈ కారణంగా వరుసగా మూడో రోజు కూడా మార్కెట్‌ నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్‌ 367.25 పాయింట్ల నష్టంతో 85,041.45 వద్ద ముగియగా నిఫ్టీ 99.80 పాయింట్ల నష్టంతో 26,042.30 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 470.88 పాయింట్ల వరకు కూడా దిగజారి 84,937.82 పాయిం ట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

వేదాంతా షేరు దూకుడు: వ్యాపార దిగ్గజాల్లో ఒకటైన వేదాంతా లిమిటెడ్‌ షేరు శుక్రవారం ఏడాది గరిష్ఠానికి చేరింది. ఈ ఏడాదిలో ఈ షేరు ఇప్పటివరకు 35ు పెరిగింది. బీఎ్‌సఈలో 35.29ు లాభపడి ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.607.65ని తాకింది. వరుసగా 13 సెషన్లలో ఈ షేరు 17.44ు దూసుకుపోయింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande