గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌..! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ముంబై, 27 డిసెంబర్ (హి.స.) ఇది నిజంగా బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పాలి.. ఎందుకంటే.. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టుగానే గోల్డ్‌ రేట్స్‌ ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ప్రధానంగా అంతర్జా
gold


ముంబై, 27 డిసెంబర్ (హి.స.)

ఇది నిజంగా బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పాలి.. ఎందుకంటే.. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టుగానే గోల్డ్‌ రేట్స్‌ ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారికి ఇది మంచి లాభాలా పంటగా మారింది. డిమాండ్‌ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయని ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వెల్లడించింది. ఈ క్రమంలోనే గత ఐదు రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది కూడా గోల్డ్‌ షాక్‌ తప్పదనేది నిపుణుల అంచనా. మరి ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ మార్కెట్లలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,630 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,910 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,100 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,030, 22 క్యారెట్ల ధర రూ.1,28,360 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 లుగా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,030, 22 క్యారెట్ల ధర రూ.1,28,360 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,100 లుగా ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,030, 22 క్యారెట్ల ధర రూ.1,28,360 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,100 లుగా ఉంది.

విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,40,030, 22 క్యారెట్ల ధర రూ.1,28,360 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,100 లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande