యమ డేంజర్‌లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ఢిల్లీ.29, డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం భయంకర వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోగా, మరోవైపు తీవ్రమైన చలి గాలులు నగరాన్ని తీవ్రంగా వణికిస్తున్నాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత స
Delhi Air Pollution


ఢిల్లీ.29, డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం భయంకర వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోగా, మరోవైపు తీవ్రమైన చలి గాలులు నగరాన్ని తీవ్రంగా వణికిస్తున్నాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) 400 మార్కును దాటి ‘తీవ్రమైన’ శ్రేణికి చేరుకుంది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ)నగరంలో ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది./

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీబీసీబీ) గణాంకాల ప్రకారం నేటి (సోమవారం) ఉదయం ఢిల్లీలో సగటు ఏక్యూఐ 404గా నమోదైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఆనంద్ విహార్, బవానా, జహంగీర్‌పురి తదితర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు 450 మార్కును దాటాయి. గాలి వేగం తగ్గడానికి తోడు తేమశాతం పెరగడం వల్ల వాహనాల ఉద్గారాలు, దుమ్ము కణాలు భూమికి సమీపంలోనే నిలిచిపోయి దట్టమైన పొగమంచులా ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రజలు శ్వాస తీసుకునేందుకు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande